
బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈమేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పింది.
ఈ ఒప్పందంలో భాగంగా 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా సిమ్ కార్డు అమ్మకాలు చేయనున్నారు. ఇప్పటికే అస్సాంలో విజయవంతంగా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. దాంతో ఈ సర్వీసులు భారతదేశం అంతటా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోస్టాఫీసు బ్రాంచీ బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు అమ్మడంతోపాటు, రీఛార్జ్ సేవల కోసం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)గా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: అదానీ స్టాక్స్‌లో ర్యాలీ..