breaking news
Peshi
-
ఇదిగో ఆధారాలు..పవన్ పేషీ భూకబ్జా..!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్న వ్యక్తిపై వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన భీమర శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో తనకు చెందిన 11 ఎకరాల 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సురేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై 2004 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ భూమిని తమకు అప్పగించకపోవడం బాధాకరమని రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సత్య అనే వ్యక్తితో పాటు మరొకరు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి సురేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి పాస్‌బుక్‌లు ఇవ్వకుండా సురేష్ అడ్డుపడుతున్నాడని, చుట్టుపక్కల భూములకు పాస్‌బుక్‌లు వచ్చినా తన భూమికి మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని రమణబాబు అన్నారు. తన భూమి విలువ రూ.110 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, తన పేషీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రమణబాబు కోరారు. నా భూమిని నాకు అప్పగించకపోతే, పవన్ కళ్యాణ్‌ను కలసి, ఆయన పేషీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా వెల్లడిస్తాను’ అని హెచ్చరించారు. ఓవైపు అవినీతి, భూకబ్జాలపై పోరాడతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, తన పేషీలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అని రమణబాబు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ !
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణం కోసం రూ.8 కోట్ల విలువ చేసే మట్టి, మొరం తవ్వకాల భాగోతం గనులు, భూగర్భశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేషీకి చేరినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ జరిమానా వేసిన సుమారు రూ. 8 కోట్లను రద్దు చేయాలని కాంట్రాక్టర్లు మంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్య రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్వారు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రేవూరు నారాయణరెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్స్ట్రక్షన్, మిలీనియం కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్ఈలను బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. కాగా, అభివృద్ధి పనుల కోసమే మట్టి తవ్వామని కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు విన్నవించాయి. రివి జన్ పిటిషన్ సమర్పించిన ఆ సం స్థలు రాజకీయ నేతలతో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జరిమా నా, మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉంది. -
ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ రాజుకుంటోంది. డిపార్ట్మెంటుకు సంబంధించి కామన్ యూజర్ గ్రూప్ (సీయూజీ) సిమ్ కార్డులను ఎక్సైజ్ మంత్రి పేషీ మొత్తానికి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పెట్టడం.. ఇది కుదరదంటూ ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. మంత్రి పేషీ సిబ్బందితో పాటు గన్మెన్లకు సిమ్ కార్డులు ఇవ్వాలంటూ పేషీ నుంచి ఫైల్ సర్క్యులేట్ చేశారు. మొత్తం తొమ్మిది మంది పేర్ల జాబితా ఫైల్ ఎక్సైజ్ శాఖకు చేరింది. ఒక్క మంత్రికే సిమ్ కార్డు ఇచ్చే విధానం ఉందని, ఆయన పేషీ సిబ్బందికి ఇచ్చే విధానం లేదని అధికారులు తేల్చిచెప్పారు. -
సాక్షి కథనంపై సీఎం కేసీఆర్ స్పందన


