గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శయాత్ర | sharmila paramarsha yatra in greater hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శయాత్ర

Jan 5 2016 12:39 PM | Updated on May 29 2018 4:23 PM

గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శయాత్ర - Sakshi

గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరామర్శయాత్ర చేస్తున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరామర్శయాత్ర చేస్తున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు.

పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన రాజన్న తనయ.... హైటెక్‌సిటీ, కొండాపూర్‌, మియాపూర్‌ మీదుగా చందానగర్‌ చేరుకున్నారు. అక్కడ తారానగర్‌ తుల్జాభవన్‌ దేవాలయం సమీపంలోని దిగంబరరావు ఇంటికి వెళ్లి... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. దిగంబరరావు కుటుంబం స్థితిగతులను, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శ యాత్రలో వైఎస్ షర్మిల వెంట... వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement