దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు | SCR to run special trains | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

Apr 8 2016 7:31 PM | Updated on Sep 3 2017 9:29 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ - ముంబయి (07058/07057) ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ రాత్రి 9.20 గంటలకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 కు ఆదిలాబాద్ చేరుకుంటుంది. 
 
అలాగే సికింద్రాబాద్ - అజ్ని (07061/07062) ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీ రాత్రి 10.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.25 కు అజ్ని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ రాత్రి 10.20కి అజ్ని స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చందాపూర్, సేవాగ్రామ్ స్టేషన్‌ల మీదుగా అజ్ని స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తుందని సీపీఆర్వో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement