చదువు నేర్పవలిసిన గురువు 13 సంవత్సరాల విద్యార్థినితో వెకిలి వేషాలు వేశాడు.
హైదరాబాద్ సిటీ: చదువు నేర్పవలిసిన గురువు 13 సంవత్సరాల విద్యార్థినితో వెకిలి వేషాలు వేశాడు. దీంతో విద్యార్థిని నెరేడ్మేట్ పోలీసులను ఆశ్రయించింది. నెరేడ్మేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేరేడ్మెట్ సమారిటన్ స్కూల్ ప్రిన్సిపాల్ పరకాల రామకృష్ణ(43), తనతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.