గుడుంబా 'శంకర్‌సింగ్' అరెస్టు | sankar sing arrested in gudumba case | Sakshi
Sakshi News home page

గుడుంబా 'శంకర్‌సింగ్' అరెస్టు

Jun 10 2015 7:30 PM | Updated on Aug 20 2018 4:44 PM

గుడుంబా 'శంకర్‌సింగ్' అరెస్టు - Sakshi

గుడుంబా 'శంకర్‌సింగ్' అరెస్టు

గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలతో కొరకరాని కొయ్యగా మారిన శంకర్‌సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

గచ్చిబౌలి (హైదరాబాద్): గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలతో కొరకరాని కొయ్యగా మారిన శంకర్‌సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌రాంగూడకు చెందిన నింబా శంకర్ సింగ్ (35) కొన్నేళ్లుగా తన నివాసం సమీపంలోనే గుడుంబా తయారు చేస్తూ ఖానామెట్, చందానాయక్ నగర్ తండా, ఇజ్జత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఇంటి వద్దనే అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి అరకిలో గంజాయి, వంద గుడుంబా పాకెట్లు, వంద పాలీథిన్ కవర్లు, రెండు సంచుల నల్లబెల్లం, 30 కిలోల చక్కెర, రెండు డ్రమ్ములు, పైపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో గతంలో రాయదుర్గం పోలీసులు రిమాండ్‌కు పంపించారు.మొత్తం 83 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement