షాన్‌దార్ సెల్ఫీ... | Sandar selfeei ... | Sakshi
Sakshi News home page

షాన్‌దార్ సెల్ఫీ...

Nov 3 2016 12:48 AM | Updated on Sep 4 2017 6:59 PM

షాన్‌దార్ సెల్ఫీ...

షాన్‌దార్ సెల్ఫీ...

హిమాయత్‌సాగర్‌లోని షాదాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో బుధవారం రెండో రోజూ‘ పల్సేషన్’ కొనసాగింది.

హిమాయత్‌సాగర్‌లోని షాదాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో బుధవారం రెండో రోజూ‘ పల్సేషన్’ కొనసాగింది. వైద్య విద్యార్థినులు స్వచ్ఛభారత్‌లో భాగంగా హరితహారం నిర్వహించారు. వర్ధమాన తార మెహ్రీన్ కౌర్ హాజరై సందడి చేసింది. సెల్ఫీలు దిగుతూ  ఉత్సాహం నింపింది. దేశ భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టనున్న వైద్య విద్యార్థులు.. ప్రకృతి పచ్చగా వర్ధిల్లేందుకు తమ వంతు ఊపిరిలూదారు.

హిమాయత్‌సాగర్ రోడ్‌లోని షాదాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన విద్యార్థులు తమ కళాశాలతో పాటు ఆసుపత్రిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం సందడిగా నిర్వహించారు. ‘షాదాన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక కార్యక్రమం పల్సేషన్‌లో భాగంగా నిర్వహించిన ఈ హరితహారంలో విద్యార్థులతో పాటు వైద్యులు సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీనటి మెహ్రీన్ కౌర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.     - సాక్షి, సిటీబ్యూరో

Advertisement
 
Advertisement
Advertisement