ఉత్సాహంగా ‘సాక్షి’ ఇండియా స్పెల్‌ బీ సెమీ ఫైనల్స్‌ | Sakshi india spell Bee semi finals | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘సాక్షి’ ఇండియా స్పెల్‌ బీ సెమీ ఫైనల్స్‌

Nov 21 2016 2:40 AM | Updated on Sep 4 2017 8:38 PM

‘సాక్షి’ ఇండియా స్పెల్‌ బీ సెమీ ఫైనల్స్‌ ఆదివారం హైదరాబాద్‌లోని (బంజరాహిల్స్‌) ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.

పోటీలో చురుగ్గా పాల్గొన్న 400 మంది విద్యార్ధులు
ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్‌లో ఫైనల్స్‌
హైదరాబాద్‌:
‘సాక్షి’ ఇండియా స్పెల్‌ బీ సెమీ ఫైనల్స్‌ ఆదివారం హైదరాబాద్‌లోని (బంజరాహిల్స్‌) ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్వార్టర్‌ ఫైనల్స్‌లో క్వాలిఫై అయిన సుమారు 400 మందికిపైగా విద్యార్థులు సెమీ ఫైనల్స్‌లో పాల్గొని తమ మెదడుకు పదును పెట్టారు. సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘బీ మాస్టర్‌’ విక్రమ్‌ అడిగిన ప్రతి ఆంగ్ల పదానికీ విద్యార్థులు చురుకుగా స్పెల్లింగ్‌ రాశారు. పోటీలను స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు కల్యాణి చౌదరి పర్యవేక్షించారు. సెమీ ఫైనల్స్‌లో క్వాలిఫై వారికి డిసెంబర్‌లో ఫైనల్స్‌ జరుగుతాయి. కాగా, అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ‘సాక్షి’ ఇండియా స్పెల్‌ బీ పోటీలు తమ స్కూల్లో జరగడం ఆనందంగా ఉందని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రిన్సిపాల్‌ టి.వీణామూర్తి, ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి చౌదరి తెలిపారు.

తమ స్కూల్‌ సిబ్బంది, విద్యార్థులకు ఈ పోటీ కొత్త అనుభూతిని కలిగించిందన్నారు. విద్యార్థులు కమ్యునికేషన్‌ స్కిల్స్‌ను పెంపుందించుకోవడానికి ‘సాక్షి’ ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్పెల్‌ బీ విధానాన్ని తమ స్కూల్లో నిరంతరం అమలు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement