ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు | Rs. 50 thousand to every High School | Sakshi
Sakshi News home page

ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు

Aug 3 2017 1:04 AM | Updated on Sep 17 2017 5:05 PM

ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు

ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రంలోని 5,639 ఉన్నత పాఠశాలల కోసం రూ.28.19 కోట్ల నిధులను రాష్ట్రీయ మాధ్య మిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద కేటాయించింది.

ఈ నిధుల్లో రూ. 20 వేలను పాఠశాలల్లో మరమ్మతులు, ల్యాబ్‌ పరికరాల కొనుగోలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లకు, రూ. 5 వేలను పుస్తకాలు, పీరియాడికల్స్, వార్తా పత్రికలు, స్పోర్ట్స్‌ పరికరాల కొనుగోలుకు, రూ. 25 వేలను తాగు నీరు, విద్యుత్‌ చార్జీలు, ఇంటర్‌నెట్, డిజిటల్‌ తరగతుల నిర్వహణకు విని యోగించాలని సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను జారీచే సింది. వీటిలో రూ. 500 వరకే డబ్బు ను నేరుగా ఖర్చు చేయాలని, అంత కుమించి వినియోగించాల్సి వస్తే చెక్‌ రూపంలో, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వినియోగించాలని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement