ఎవరికి ఓటేశారో చెబితే నేరం | revealing to whom you have voted is a crime, says ceo bhanwar lal | Sakshi
Sakshi News home page

ఎవరికి ఓటేశారో చెబితే నేరం

Dec 26 2015 5:37 PM | Updated on Sep 3 2017 2:37 PM

ఎవరికి ఓటేశారో చెబితే నేరం

ఎవరికి ఓటేశారో చెబితే నేరం

తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు.

తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సెల్‌ఫోన్లను గానీ, కెమెరాలను గానీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఆయన మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement