వారు చచ్చిన వారితో సమానం: రేవంత్ | Revanth reddy fire | Sakshi
Sakshi News home page

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్

Feb 27 2016 3:34 AM | Updated on Aug 29 2018 7:31 PM

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్ - Sakshi

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్

టీడీపీ నుంచి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానమని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉప్పు, కారం తిని పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానమని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉప్పు, కారం తిని పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా డివిజన్ల నుంచి బరిలోకి దిగిన కార్పొరేట్ అభ్యర్థులతో శుక్రవారం ట్రస్ట్ భవన్‌లో రేవంత్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందని, కానీ కొందరికి ఆ విశ్వాసం లేకుండా పోయిందని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి లేని వారు పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement