ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన టీఆర్‌ఎస్ నేత మంద జగన్నాధంకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి.దానకర్ణాచారి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్‌ఎస్ నేత మంద జగన్నాధంకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి.దానకర్ణాచారి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మందా జగన్నాధం జన్మదినం సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేక్ కట్‌చేసి, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎస్.రవికుమార్ ముదిరాజ్, అంబరీశ్, శ్రీధర్, అఖిల భారత ఓబీసీ మహిళ సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మీ, తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దశరథలక్ష్మీ, ఎం.తిరుమల, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.