గెస్ట్ హౌస్ లో వ్యభిచారం | prostitution in guest house | Sakshi
Sakshi News home page

గెస్ట్ హౌస్ లో వ్యభిచారం

Oct 27 2015 8:23 AM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు.

ఐదుజంటలు పట్టివేత

 కీసర: రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హరిత గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. వేర్వేరు గదుల్లో ఐదుగురు మహిళలతో గడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఎస్‌ఓటీ డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐలు స్వామి, రంగాస్వామి, ఎస్‌ఐ రాములు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement