సెక్రటేరియట్ పరిధిలో నిషేధాజ్ఞలు | Prohibitory orders in secretariat promises | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్ పరిధిలో నిషేధాజ్ఞలు

Sep 17 2016 7:35 PM | Updated on Sep 15 2018 8:38 PM

సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు విధించారు.

హైదరాబాద్: సైఫాబాద్ ఠాణా పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలు చేపట్టవద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ ఆంక్షలు ఈ నెల 17 ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ రెండు నెలల పాటు బహిరంగ సమావేశాలు, ఐదుగురు మించి వ్యక్తులు గుమికూడవద్దని, ఆయుధాల, బ్యానర్లు, ప్లకార్డులు తదితర వస్తువులు వెంట పెట్టుకోవద్దని కోరారు. ఇవి ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 88 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement