ఎడతెగని నిరీక్షణ... | Professor Gopikrishna’s family anxiously await his release | Sakshi
Sakshi News home page

ఎడతెగని నిరీక్షణ...

Nov 10 2015 10:21 AM | Updated on Sep 3 2017 12:20 PM

గోపీకృష్ణ భార్య కల్యాణి, పిల్లలు

గోపీకృష్ణ భార్య కల్యాణి, పిల్లలు

లిబియాలో పని చేస్తున్న ప్రొఫెసర్ గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారిని విడిపించడంలో...

నాచారం(హైదరాబాద్): లిబియాలో పని చేస్తున్న ప్రొఫెసర్ గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారిని విడిపించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి  బాధితులు ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తారో కనీస సమాచారం కూడా అందించడం లేదన్నారు.

మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని గోపీకృష్ణ భార్య కల్యాణి కన్నీరుమున్నీరయ్యారు. మూడు కుటుంబా లు ఆయనపైనే ఆధారపడి ఉన్నాయని, ప్రస్తుతం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోదరుడు మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ వారిని విడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ హామీ ఇచ్చినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా తన సోదరుడిని విడిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలువనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement