'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు' | Producers council condemns Natti kumar allegations | Sakshi
Sakshi News home page

'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు'

Aug 24 2016 8:43 PM | Updated on Oct 16 2018 9:08 PM

'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు' - Sakshi

'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు'

గ్యాంగ్స్టర్ నయీంతో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి బుధవారం ఓ ప్రకటన చేసింది.

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంతో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి బుధవారం ఓ ప్రకటన చేసింది. ప్రచారం కోసమే కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నిర్మాతల మండలి తెలిపింది. వారు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని, అడిగితే ఆధారాలు చూపిస్తానని తప్పించుకున్నారని నిర్మాతల మండలి తెలిపింది.

కాగా నిర్మాత నట్టికుమార్ ఆరోపణలు బాధ కలిగించాయని నిర్మాత అశోక్కుమార్ అన్నారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి అతని ఆరోపణలపై సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నట్టికుమార్పై పరువునష్టం కేసు వేస్తానని అశోక్ కుమార్ హెచ్చరించారు.

అలాగే ఫిల్మ్ ఛాంబర్లో రూ.14 కోట్లు నిధులు మాయంపై కూడా నిర్మాతల మండలి స్పందించింది. రూ.60 లక్షల నిధులు మాత్రమే మాయం అయ్యాయని, దీనిపై అకౌంటెంట్ శేఖర్ బాబు, మరో అకౌంటెంట్పై కేసులు కూడా నమోదు అయినట్లు నిర్మాతల మండలి తెలిపింది. కాగా నయీంకు కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు కూడా సహకరించారని నట్టికుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement