breaking news
Producer Ashok Kumar
-
'నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంతో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి బుధవారం ఓ ప్రకటన చేసింది. ప్రచారం కోసమే కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నిర్మాతల మండలి తెలిపింది. వారు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని, అడిగితే ఆధారాలు చూపిస్తానని తప్పించుకున్నారని నిర్మాతల మండలి తెలిపింది. కాగా నిర్మాత నట్టికుమార్ ఆరోపణలు బాధ కలిగించాయని నిర్మాత అశోక్‌కుమార్ అన్నారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి అతని ఆరోపణలపై సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నట్టికుమార్‌పై పరువునష్టం కేసు వేస్తానని అశోక్ కుమార్ హెచ్చరించారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్లో రూ.14 కోట్లు నిధులు మాయంపై కూడా నిర్మాతల మండలి స్పందించింది. రూ.60 లక్షల నిధులు మాత్రమే మాయం అయ్యాయని, దీనిపై అకౌంటెంట్ శేఖర్ బాబు, మరో అకౌంటెంట్‌పై కేసులు కూడా నమోదు అయినట్లు నిర్మాతల మండలి తెలిపింది. కాగా నయీంకు కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు కూడా సహకరించారని నట్టికుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
కడసారిగా ఆర్తీ అగర్వాల్
ఆర్తీ అగర్వాల్ నటించిన చివరి చిత్రం ‘ఆపరేషన్ గ్రీన్ హట్’. ఎన్.ఎ రహ్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ- ‘‘చాలా మంది నటీనటులు ఎన్నో ఆశలతో, కోరికలతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఇదే జీవితంగా బతుకుతూ ఉంటారు. అవకాశాలు రాకపోతే అగాథంలోకి వెళిపోతారు. ఇదే పరిస్థితి ఆర్తీ అగర్వాల్‌కు ఎదురైంది. చిన్న వయసులోనే పెద్ద హీరో యిన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించు కుంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా మన మధ్యలో లేకపోవడం బాధగా ఉంది’’ అని చెప్పారు. ‘‘తమిళ, మలయాళ వెర్షన్ల విషయంలో సెన్సార్ వాళ్లు కావాలనే జాప్యం చేస్తున్నారు. దీనిపై పోరాడుతున్నాం. ఈ నెలాఖరులోనే ఢిల్లీలో ఆడియో విడుదల చేయనున్నాం ’’ అని నిర్మాత చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చూసి, ‘బాగా వచ్చింది. నాకు ిహట్ ఖాయం’ అని ఆర్తీ అగర్వాల్ సంతోషపడ్డారు. కానీ, ఈలోపే ఆమె వెళ్లిపోయారు. ఇలా జరగడం దురదృష్టకరం. ఓ మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, శివాజీరాజా, సాగరిక తదితరులు పాల్గొన్నారు.