ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం | private school students missing and case filed | Sakshi
Sakshi News home page

ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం

Mar 16 2017 11:55 PM | Updated on Nov 9 2018 4:45 PM

ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం ఘటన నగరంలోని అంబర్‌పేటలో కలకలం రేపింది.

హైదరాబాద్‌: ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం ఘటన నగరంలోని అంబర్‌పేటలో కలకలం రేపింది.  పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట- బాపునగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నిధి, ప్రతిభ, సంగీత, ప్రీతి, నందినిలు కనిపించకుండా పోయారని సమాచారం.

ఈ విద్యార్థినులు ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్లిన విద్యార్థినులు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో విద్యార్థినుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement