
'ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు'
అటవీ భూములను పరిరక్షించేలా నవ్యాంధ్ర నూతన రాజధానిని డిజైన్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు.
న్యూఢిల్లీ: అటవీ భూములను పరిరక్షించేలా నవ్యాంధ్ర నూతన రాజధానిని డిజైన్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయనం లేకుండా అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అమరావతి కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు.
అటవీ భూముల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు అనుమితించామని, రాజధాని నిర్మాణ ప్రతిపాదనలపై ఇంకా తనిఖీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంలో అనుమతుల విషయంలో జాప్యం జరగలేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి తక్కువ అటవీ భూములు ఉపయోగించాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు.