అహంకారంతో మాట్లాడుతున్నారు | ponguleti sudakar reddy fire on ktr | Sakshi
Sakshi News home page

అహంకారంతో మాట్లాడుతున్నారు

May 1 2016 5:34 AM | Updated on Sep 3 2017 11:12 PM

రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్థాయిని మించి, అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.

కేటీఆర్‌పై పొంగులేటి ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్థాయిని మించి, అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తామని కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఇది మంచిదికాదని హెచ్చరించారు. కరువు, ప్రజా సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా పాలేరు ఉప ఎన్నికపైనే దృష్టి కేంద్రీకరించిందన్నా రు. రాజకీయాలను మాత్రమే కాకుండా అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకుని, కరువు నివారణ చర్యలపైనా దృష్టి పెట్టాలన్నారు. టీఆర్‌ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా పాలేరులో కాంగ్రెసే గెలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement