పీకే అయ్యర్‌కు 23 వరకు రిమాండ్ | Police registers case against star hotel for keeping Iyer | Sakshi
Sakshi News home page

పీకే అయ్యర్‌

Jun 10 2015 3:13 AM | Updated on Sep 3 2017 3:28 AM

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్‌చైర్మన్ పీకే అయ్యర్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది.

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్‌చైర్మన్ పీకే అయ్యర్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. ఈనెల 6న భువనేశ్వర్‌లో అయ్యర్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు మంగళవారం ఆయన్ను నాంపల్లి పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వై.వీర్రాజు ఎదుట హాజరుపర్చారు.  న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.  
 
డీసీ బ్రదర్స్ బెయిల్ రద్దు చేయండి..
రుణాల వ్యవహారంలో కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) యాజమానులు పి.వెంకట్రామిరెడ్డి, పి.వినాయక్ రవిరెడ్డిలకు నాంపల్లి కోర్టు మంజూరు చేసిన చట్టబద్ధ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement