హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు పోలీసులు సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు పోలీసులు సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ సాగర్ రహదారిలో బొంగులూరు గేటు దగ్గర హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 113 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రావొద్దని... హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానాలు విధించడమే గాకుండా వాహనాలను సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు.