రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు | pidamarthi ravi petition on vemula rohith suicide | Sakshi
Sakshi News home page

రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు

Jan 19 2016 3:56 PM | Updated on Sep 3 2017 3:55 PM

ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది.

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది. వచ్చే నెల ఒకటవ తేదీ లోగా విద్యార్థి రోహిత్ మృతిపై నివేదిక సమర్పించాలని హెచ్సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు, సైబరాబాద్ సీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement