జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను సీజ్ చేశారు.
ఓవర్‌లోడు వాహనాలు సీజ్
Dec 15 2016 3:59 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను సీజ్ చేశారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఆర్టీఏ, విజిలెన్స్, సేల్స్‌టాక్స్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడంతో పాటు సుమారు రూ. 4 లక్షల జరిమానా విధించారు.
Advertisement
Advertisement