‘విద్యార్థులకూ ఆప్షనల్‌ సెలవులు’ | Optional Holidays for Students | Sakshi
Sakshi News home page

‘విద్యార్థులకూ ఆప్షనల్‌ సెలవులు’

Aug 31 2017 2:27 AM | Updated on Sep 12 2017 1:23 AM

పాఠశాలల్లో ఆప్షనల్‌ హాలిడేస్‌ను ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకూ

హైదరాబాద్‌: పాఠశాలల్లో ఆప్షనల్‌ హాలిడేస్‌ను ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకూ వర్తింపజేయాలని పీఆర్‌టీయూ–టీఎస్‌ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, యూటీఎఫ్‌ అధ్యక్షుడు నర్సిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. పండుగల సందర్భంగా  కొన్ని సార్లు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తున్న నేపథ్యంలో ఐదు ఆప్షనల్‌ హాలిడేస్‌ను పాఠశాల మొత్తానికి సెలవులుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే 6, 7 తరగతులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌లు భౌతిక శాస్త్రాన్ని బోధించాలా? గణితాన్ని స్కూల్‌ అసిస్టెంట్‌ లేదా టీచర్లు బోధించాలా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement