తెల్లాపూర్‌లోని సర్వే నంబర్ 323 నుంచి 332, 336 నుంచి 340లోని హెచ్‌ఎండీఏకు చెందిన భూమి పేరు...
సాక్షి కథనంపై హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు స్పందన
సాక్షి, హైదరాబాద్: తెల్లాపూర్‌లోని సర్వే నంబర్ 323 నుంచి 332, 336 నుంచి 340లోని హెచ్‌ఎండీఏకు చెందిన భూమి పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ పొందిన వారికి నోటీసులు జారీ చేశామని సంస్థ కమిషనర్ టి.చిరంజీవులు మంగళవారం తెలిపారు. ‘ఎల్‌ఆర్‌ఎస్‌తో ఎసరు’ పేరుతో సాక్షిలో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘అక్రమంగా ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ పొందిన దాదాపు 30 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఇంకా మరెంత మందికి పొరపాటున ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ చేశామా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. నిజమని తేలితే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుడికి నోటీసులిస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం’ అని చిరంజీవులు సాక్షికి తెలిపారు.