వేడుకగా 2017 | new year party in hyd city | Sakshi
Sakshi News home page

వేడుకగా 2017

Jan 1 2017 1:54 AM | Updated on Oct 17 2018 4:29 PM

వేడుకగా 2017 - Sakshi

వేడుకగా 2017

మహానగరం మురిసింది. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ..

మహానగరం మురిసింది. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిటీ చిందేసింది. రెండు సంత్సరాలకు వారధిలాంటి డిసెంబర్‌ 31 రాత్రివిద్యుత్‌ కాంతులను సింగారించుకుంది. గ్రేటర్‌ నలుదిశలా వెలసిన వెలుగుల వేదికలపై
నవ వసంత వేడుకలు కొంగొత్త కాంతులను పంచాయి.

సిటీలోని పబ్‌లు, క్లబ్‌లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, ఓపెన్‌ ఆడిటోరియాలూ యువత ఆటపాటలతో నిండిపోయాయి. కాలం పరుగును లెక్కిస్తూ పరిగెట్టిన గడియారం ముల్లు టిక్‌..టిక్‌.. శబ్దం ప్రతి గుండెనూ తాకింది. అర్ధరాత్రి అడుగడుగునా ఆనంద పల్లవి అందుకుని ‘కొత్త’ రాగం పాడింది. రోడ్లు కేరింతలతో కేకపుట్టించాయి. నయాసాల్‌ జోష్‌తో సెల్‌ టవర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement