నవ వధువు అనుమానాస్పద మృతి | new bride suspicious death in hyderabad malkajgiri | Sakshi
Sakshi News home page

నవ వధువు అనుమానాస్పద మృతి

Jun 14 2016 9:50 AM | Updated on Sep 4 2017 2:28 AM

నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. లీలావతి అనే యువతికి 8 నెలల క్రితం శశికిరణ్కు వివాహమైంది. లీలావతి సోమవారం రాత్రి అనూహ్యంగా ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు శశికిరణ్ చెబుతున్నాడు.

వరకట్న వేధింపులే కారణమని, భర్తే హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మల్కాజ్ గిరిలోని అతని ఇంటి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement