కటకటాల్లోకి మాయలేడీ | name of charity fraud | Sakshi
Sakshi News home page

కటకటాల్లోకి మాయలేడీ

Jul 23 2015 11:59 PM | Updated on Sep 15 2018 3:51 PM

దయ్యాలు సోకాయంటూ మాయమాటలు చెప్పి మహిళను మోసగించిన మాయలేడీని రెయిన్‌బజార్ పోలీసులు

విరాళాల పేరిట మోసాలు
13 తులాల నగలు స్వాధీనం

 
యాకుత్‌పురా: దయ్యాలు సోకాయంటూ మాయమాటలు చెప్పి మహిళను మోసగించిన మాయలేడీని రెయిన్‌బజార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. డబీర్‌పురాలోని మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎస్.గంగాధర్ ఇన్‌స్పెక్టర్ జి. రమేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట అల్‌జాబ్రీ కాలనీకి చెందిన నిషాత్ ఫాతిమా ఆలియాస్ నస్రీన్ ఫాతిమా (38) మదర్సాల నిర్వాహణ కోసం విరాళాలు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో జవహర్‌నగర్‌లో నివాసముండే సయ్యద్ మహ్మద్ హుస్సేన్, సయ్యదా నుషత్ ్ర(27) దంపతుల ఇంటికి వెళ్లింది.  విరాళాలు కావాలంటూ నుషత్‌న్రు అడిగింది. నుషత్‌న్రు మాటల్లో పడేసిన ఫాతిమా నీ ముఖంలో ఏదో మార్పు కనిపిస్తుందని వివరించింది.

నీ ఆరోగ్యం బాగుండదు... దయ్యం సోకిందంటూ నమ్మబలికించి నయం చేస్తానని సూచించింది. దీంతో నుషత్ ్రఫాతిమా మాటలకు ఆకర్షితురాలై ఎలా నయం చేస్తావంటూ అడిగింది. నీలో ఉన్న దయ్యాన్ని తొలగిస్తానని నమ్మబలికించి గతేడాది సెప్టెంబర్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం రూ. 52,500 వసూలు చేసింది అయినా నుషత్ ్రఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి తేడా కనిపించకపోవడంతో ఫాతిమాను ఆరా తీసింది. దీంతో ఫాతిమా నీ మెడలో బంగారు ఆభరణాలు ఉన్నందున దయ్యం  విడిచి వెళ్లడం లేదని చెప్పింది. దీంతో నుషత్ ్రవద్ద డబ్బులు అయిపోవడంతో ప్రతి నెల ఒక్కో నగ చొప్పున 13 తులాల బంగారు ఆభరణాలను రాబట్టింది. అయినా ఆర్యోగంలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో బాధితురాలు నుషత్ ్రజరిగిన ఘటనపై రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఎస్సై గోవింద్ స్వామి నేతృత్వంలోని హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్ జితేందర్, పర్వేజ్, కిరణ్ కుమార్, ప్రదీప్ బృందం నిషాత్ ఫాతిమాను అదుపులోకి తీసుకొని విచారించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement