హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానాలకు మాక్ కౌంటింగ్ పూర్తయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే
Mar 21 2017 4:49 PM | Updated on Aug 14 2018 5:56 PM
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానాలకు మాక్ కౌంటింగ్ పూర్తయింది. అంబర్‌పేట్‌లోని ఇండోర్ స్టేడియంలో మాక్ కౌంటింగ్‌ను నిర్వహించారు. కాగా, బుధవారం ఉదయం 8 గంటల నుంచి అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ కౌంటింగ్‌లో పాటించాల్సిన నిబంధనల గురించి సిబ్బందికి వివరించారు.
మొత్తం 28 టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయగా, మూడు షిఫ్ట్‌లకు కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఒక్కో షిఫ్ట్‌కు 30 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లు అందుబాటులో ఉంటారు. ఈ కౌంటింగ్ పక్రియను సీసీటివీల ద్వారా ఎన్నికల సంఘం నేరుగా పరిశీలించనుంది. కౌంటింగ్ పక్రియను పరిశీలించడానికి వచ్చే అభ్యర్ధుల ఏజెంట్‌లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు. ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగనుంది.
Advertisement
Advertisement