మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
హైదరాబాద్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్లు, అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అధికారులు సరిగా పని చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క అధికారి అయినా ఉదయం పూట ఫీల్డ్లోకి వెళ్తున్నారా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్తో సహా పట్టణ ప్రాంతాల్లో నాలాల ఆక్రమణలపై కఠినంగా ఉండల్సిందేనని కేటీఆర్ సూచించారు. అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.