మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరాం | Medical shops open in hospitals, says kamineni srinivas | Sakshi
Sakshi News home page

మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరాం

Oct 14 2015 12:17 PM | Updated on Mar 23 2019 8:59 PM

మెడికల్ షాపులు బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్ : మెడికల్ షాపులు బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో కామినేని మాట్లాడుతూ.. బంద్ సందర్భంగా అన్ని ఆసుపత్రులకు అటాచ్మెంట్గా ఉన్న మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరామని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్ని జిల్లాల డ్రగ్ ఉన్నతాధికారులను ఆదేశించామని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement