అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి ఎంబీఏ విద్యార్థి మృతి | MBA student fell down to death in secuderabad | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి ఎంబీఏ విద్యార్థి మృతి

Mar 10 2017 11:09 AM | Updated on Oct 16 2018 2:53 PM

అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది.

హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. స్థానిక స్టైల్‌ హోం అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి ఓ ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
 
మృతుడు ఢిల్లీకి చెందిన మొహక్‌గా గుర్తించారు. ఇతను తార్నాకలోని నర్సిమోంజి కళాశాలలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. ప్రమాదవశాత్తుపై నుంచి పడ్డాడా.. లేక ఎవరైనా కావాలనే తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement