బస్‌ స్టాప్‌లో వ్యక్తి ఆత్మహత్య | man suicide attempt in bus stand | Sakshi
Sakshi News home page

బస్‌ స్టాప్‌లో వ్యక్తి ఆత్మహత్య

Aug 18 2017 10:17 AM | Updated on Sep 4 2018 5:29 PM

బస్‌స్టాప్‌లో నిల్చున్న వ్యక్తి వంటి పై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

హైదరాబాద్‌: బస్‌స్టాప్‌లో నిల్చున్న వ్యక్తి వంటి పై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన నగర శివారులోని హయత్‌నగర్‌లో వెలుగుచూసింది. వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పేలోపే అగ్నికి ఆహుతయ్యాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నల్లగొండ జిల్లా  చౌటుప్పల్‌ హనుమాన్‌ నగర్‌కు చెందిన కనకయ్యగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement