ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన | lorry drivers agitation against challans | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన

Mar 12 2015 9:29 PM | Updated on Sep 2 2017 10:43 PM

ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన

ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన

లారీ డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల దందాలను నిరసిస్తూ చక్రిపురం ఇసుక లారీల అడ్డా వద్ద బ్రిక్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు.

కుషాయిగూడ (హైదరాబాద్‌సిటీ) : లారీ డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల దందాలను నిరసిస్తూ చక్రిపురం ఇసుక లారీల అడ్డా వద్ద బ్రిక్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్డు పక్కన నిలిపిన లారీలకు సైతం వేల రూపాయలు చలానాలు రాస్తున్నారని ఆరోపించారు. మామూళ్లు ఇవ్వకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతూ వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి నెల మామూళ్లు చెల్లించగానే ట్రాఫిక్ పోలీసులు జారీ చేస్తున్న కార్డులు, వారు విధిస్తున్న జరిమానా పత్రాలను మీడియాకు చూపారు. కార్యక్రమంలో ప్రతినిధులు నాను నాయక్,బిచ్చానాయక్, ప్రశాంత్,బాలజీ, పాండు, బిక్షపతి, లింగానాయక్, మాన్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement