జిల్లా జైలు ఆవరణలో జీవిత ఖైదీ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శివలింగం కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం కప్పాడుకు చెందిన మొగులయ్య (50)కు సొంత కూతురిపై అత్యాచారం చేసిన నేరంపై 2006లో జీవిత ఖైదు విధించారు.
సంగారెడ్డి రూరల్: జిల్లా జైలు ఆవరణలో జీవిత ఖైదీ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శివలింగం కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం కప్పాడుకు చెందిన మొగులయ్య (50)కు సొంత కూతురిపై అత్యాచారం చేసిన నేరంపై 2006లో జీవిత ఖైదు విధించారు.
2015 జూన్ వరకు చర్లపల్లి జైలులో ఉన్న మొగులయ్యను జులైలో కందిలోని జిల్లా జైలుకు తరలించారు. నెల క్రితం మొగులయ్య పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆదివారం తిరిగి జైలుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం జిల్లా జైలు ఆవరణలో గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.