హైదరాబాద్లో ఇక ఎల్ఈడీ టీవీల తయారీ! | LED tv's to be manufactured in hyderabad soon | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఇక ఎల్ఈడీ టీవీల తయారీ!

Sep 10 2015 5:50 PM | Updated on Aug 15 2018 9:30 PM

హైదరాబాద్లో ఇక ఎల్ఈడీ టీవీల తయారీ! - Sakshi

హైదరాబాద్లో ఇక ఎల్ఈడీ టీవీల తయారీ!

హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ టీవీల తయారీకి రంగం సిద్ధమైంది. చైనాకు చెందిన మాకేనా అనే సంస్థ ఇక్కడ తమ ప్లాంటును నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ టీవీల తయారీకి రంగం సిద్ధమైంది. చైనాకు చెందిన మాకేనా అనే సంస్థ ఇక్కడ తమ ప్లాంటును నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాకేనా సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.

అలాగే, చైనాలోని షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ శావోతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్ పరికరాల తయారీ యూనిట్ను తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సానుకూల స్పందనలు వస్తుండటంతో.. షాంఘై నగరం నుంచి వ్యాపారుల బృందం ఒకటి వచ్చి హైదరాబాద్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ బృందం ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement