లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్ | krishna yadav slams telangana tdp over ghmc elections Tickets Allotment | Sakshi
Sakshi News home page

లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్

Jan 22 2016 2:50 PM | Updated on Aug 11 2018 4:50 PM

లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్ - Sakshi

లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్

ఓవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికలు తరుముకొస్తుంటే తెలంగాణ టీడీపీకి మ‌రో గ‌ట్టి షాకే త‌గిలింది. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.

హైదరాబాద్ : ఓవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికలు తరుముకొస్తుంటే తెలంగాణ టీడీపీకి మ‌రో గ‌ట్టి షాకే త‌గిలింది. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.  ఇప్పటికే అధికార పార్టీ ఆక‌ర్ష్‌కు కొంతమంది నేతలు వెళ్లిపోగా, మిగిలినవారు అసంతృప్తితో ఆ పార్టీకి దూరం అవుతున్నారు. తాజాగా సొంతపార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రేటర్ ఉపాధ్యక్ష పదవికి కృష్ణయాదవ్ రాజీనామా చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పార్టీలో బడుగు, బలహీన వర్గాలవారికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో లక్షల రూపాయిలు చేతులు మారాయని ఆరోపించారు. పార్టీని కొందరు నాయకులు గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీ నాశనం అవుతోందని కృష్ణయాదవ్ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement