ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు | key directions of the High Court on defecton | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు

Sep 21 2016 2:37 PM | Updated on Aug 31 2018 8:31 PM

ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు - Sakshi

ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీ-టీడీఎల్‌పీ) టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీచేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యం పై బుధవారం హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.


పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్‌ఎస్‌లో టీటీడీఎల్‌పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement