'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు' | Jyothula Nehru Demand for Assembly Monsoon Session Extension | Sakshi
Sakshi News home page

'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు'

Aug 14 2015 3:49 PM | Updated on Mar 23 2019 9:03 PM

'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు' - Sakshi

'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు'

ఏపీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు పర్యటనలకు తీసుకెళ్లాలన్న స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు.

హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు పర్యటనలకు తీసుకెళ్లాలన్న స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ యాత్రకు వెళ్లకూడదని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా నిర్ణయించారని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర పరిస్థితులు బాలేదని చెబుతూనే ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం 5 రోజుల్లో ముగించాలన్న నిర్ణయానికి తాము వ్యతిరేకమన్నారు. కనీసం 20 రోజులైన సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజా సమస్యలపై తన వైఖరిని అసెంబ్లీలో వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement