‘వెనుక ఎవరో ఉన్నారు’ | jogu ramanna fired on kodandaram comments | Sakshi
Sakshi News home page

‘వెనుక ఎవరో ఉన్నారు’

Jun 8 2016 3:40 AM | Updated on Sep 4 2017 1:55 AM

‘వెనుక ఎవరో ఉన్నారు’

‘వెనుక ఎవరో ఉన్నారు’

టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు.

పెద్దపల్లి రూరల్: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.

దేశ, విదేశాలకు చెందిన వారు సీఎం పాలనను ప్రశంసిస్తుంటే కోదండరాం కళ్లకు కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రైతులకు రుణమాఫీ, ప్రాజెక్టుల నిర్మాణాలు రైతుల కోసం కాదా? షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్‌రూమ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలాంటి ఎన్నో పథకాలు అమలవుతుంటే గత పాలకుల బాటనే ప్రభుత్వం పనిచేస్తోందనడం సరికాదు’’ అని అన్నారు. కోదండరాంను అందరూ గౌరవిస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement