హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన మరణించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన మరణించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రవీందర్ చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లిన జహాన .. తోటి విద్యార్థులతో కలసి పై అంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


