శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది.
గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
Sep 7 2017 12:08 PM | Updated on Sep 12 2017 2:10 AM
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. 168 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం బయలు దేరిన విమానం తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం తిరిగి రన్‌వేపై దించారు.
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
Advertisement


