టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ అవార్డు | India Bus award to Telangana RTC | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ అవార్డు

Jul 6 2016 10:52 PM | Updated on Sep 4 2017 4:16 AM

ఇంధన పొదుపు, తక్కువ ప్రమాదాలు నమోదు చేసిన సంస్థగా ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ ఆర్టీసీ ఇండియా బస్ అవార్డును కూడా కైవసం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపు, తక్కువ ప్రమాదాలు నమోదు చేసిన సంస్థగా ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ ఆర్టీసీ ఇండియా బస్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. అశోక్ లేలాండ్, అబిబస్‌లాంటి సంస్థలు ఏర్పాటు చేసిన ఇండియా బస్ అవార్డుల్లో ఉత్తర రోడ్డు రవాణాసంస్థగా జాతీయ స్థాయిలో టీఎస్‌ఆర్టీసీ నిలిచింది.

గోవాలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు గోవా రవాణాశాఖ మంత్రి సుధీర్ దవాలికర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా రవాణా బస్సులను ఉత్తమంగా నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న కేటగిరీకి గాను అన్ని ఆర్టీసీలతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడ్డాయి. నామినేషన్‌లను పరిశీలించిన కమిటీ తుదకు తెలంగాణ ఆర్టీసీని ఎంపిక చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement