మానవ విలువలు మర్చిపోతున్నారు | Ignoring human values | Sakshi
Sakshi News home page

మానవ విలువలు మర్చిపోతున్నారు

Dec 8 2016 1:28 AM | Updated on Aug 31 2018 8:31 PM

మానవ విలువలు మర్చిపోతున్నారు - Sakshi

మానవ విలువలు మర్చిపోతున్నారు

ఆయా రంగాల్లో ఉన్నత స్థారుుకి వెళ్లాలన్న ఆతృతలో ప్రజలు మానవీయ విలువలను మర్చిపోతున్నారని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమ న్ ఎక్సలెన్సీ డెరైక్టర్ స్వామీ బోధమయానంద అన్నారు.

- యాంత్రికంగా మారకుండా సమాజ సేవ చేయాలి
- హైకోర్టు న్యాయవాద సంఘాల కార్యక్రమంలో బోధమయానంద
 
 సాక్షి, హైదరాబాద్: ఆయా రంగాల్లో ఉన్నత స్థారుుకి వెళ్లాలన్న ఆతృతలో ప్రజలు మానవీయ విలువలను మర్చిపోతున్నారని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమ న్ ఎక్సలెన్సీ డెరైక్టర్ స్వామీ బోధమయానంద అన్నారు. తీరిక లేని ఈ జీవనంలో మనిషి యాంత్రికంగా మారకుండా, తనలోని దైవత్వాన్ని మేల్కొలిపి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సురేశ్ కెరుుత్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసారుు, జస్టిస్ చల్లా కోదండరామ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మనిషి తాను చేసే ప్రతీ పనిని నిజారుుతీ, నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉందని బోధమయానంద అన్నారు. జీవితంలో శ్రేష్టమైన వ్యక్తులుగా ఎదిగేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. సమస్యల పట్ల స్పందించే గుణం, పరి పక్వ ఆలోచన, కష్టించి పనిచేయాలన్న తపన మనుషులను విశిష్ట వ్యక్తులుగా మలు స్తాయన్నారు. తర్వాత జస్టిస్ రామసుబ్రమణియన్.. రామకృష్టమఠంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివేకానంద కళాశాలలో సాగిన విద్యాభ్యాస కాలం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రామకృష్ణ మఠం నిస్వా ర్థంగా ఎన్నో ఏళ్ల తరబడి సమాజ సేవ చేస్తోందని కొనియాడారు. అనంతరం ఉభయ సంఘాల ప్రతినిధుల ఆధ్వరంలో బోధమయానందను శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement