చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్‌ | I will utilize that given chance by kcr, says D srinivas | Sakshi
Sakshi News home page

చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్‌

May 26 2016 5:08 PM | Updated on Aug 15 2018 9:30 PM

చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్‌ - Sakshi

చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్‌

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్‌ నేత డి. శ్రీనివాస్‌ చెప్పారు.

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్‌ నేత డి. శ్రీనివాస్‌ చెప్పారు. ఢిల్లీకి వెళ్లి సేవచేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే టీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్‌ గురువారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారిలో డి.శ్రీనివాస్‌ను రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడారంటూ డీఎస్‌ వాపోయారు. పనిచేసే నేతలకు పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్‌ తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ అయిన పోటీ చేయొచ్చునని (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) పరోక్షంగా డి. శ్రీనివాస్‌ విమర్శించారు.

బంగారు తెలంగాణ కోసమే కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నట్టు తెలిపారు. అందుకే తనకు ఈ అవకాశమిచ్చినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరితే తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారని అన్నారు. కేసీఆర్‌ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని డీఎస్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement