మద్యం బాబులపై పోలీసులు పంజా విసిరారు.
సాక్షి, సిటీబ్యూరో: మద్యం బాబులపై పోలీసులు పంజా విసిరారు. నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జూన్ నెల తొలిరెండు వారాల్లో 515 మంది డ్రంకన్ డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన వీరిని సంబంధిత న్యాయస్థానాల్లో హజరుపరచగా 93 మందికి రెండు నుంచి పదిరోజుల పాటు జైలు శిక్ష పడింది. వీరితో పాటు ఇతరులకు న్యాయస్థానాలు జరిమానా విధించాయ’ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.