ప్రేమికులను బెదిరిస్తున్న హోంగార్డు అరెస్టు | homeguard arrested in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమికులను బెదిరిస్తున్న హోంగార్డు అరెస్టు

Dec 26 2016 2:15 PM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రేమ జంటలను బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డును, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ప్రేమ జంటలను బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డును, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సురేష్, అతడి స్నేహితుడు శ్రీనివాస్ కొంతకాలంగా గుర్రంగూడ ప్రాంతంలో జంటలుగా తిరిగే యువతీ యువకులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు తులాల బంగారు గొలుసుతో పాటు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement