మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ | head conistable madhusudhanreddy caught with a woman | Sakshi
Sakshi News home page

మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Sep 20 2015 6:30 PM | Updated on Sep 3 2017 9:41 AM

ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్.

చాంద్రాయణగుట్ట: ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.

ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలసి ఉండగా.. ఇది గమనించిన ఆమె భర్త బయటి నుంచి గడియపెట్టి స్థానికులకు విషయం చెప్పాడు. దాంతో వారందరూ కలసి మధుసూదన్‌రెడ్డిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement