breaking news
unmarritual relations
-
వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధారూరు సీఐ రామకృష్ణ, బంట్వారం ఎస్ఐ ఆనంద్ వెల్లడించారు. బంట్వారం మండలం వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్.. గత నెల 25న తన భార్య జగ్గమ్మతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యామని, బైక్ అదుపుతప్పి గుంతలో పడగా జగ్గమ్మ తలకు గాయమై చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. తనకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో జగ్గమ్మ తనను నిత్యం వేధించేదని చెప్పాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. ఉద్దేశపూర్వకంగా బైక్‌ను గుంతలో పడేసి జగ్గమ్మ తలపై బండరాయితో మోది హత్యచేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి.. పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. ఇవి చదవండి: హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి.. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
చాంద్రాయణగుట్ట: ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలసి ఉండగా.. ఇది గమనించిన ఆమె భర్త బయటి నుంచి గడియపెట్టి స్థానికులకు విషయం చెప్పాడు. దాంతో వారందరూ కలసి మధుసూదన్‌రెడ్డిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్